Show notes
మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో, కళల్లో, కథల్లో మరో ఆత్మీయ రూపంలో పలకరిస్తారు.
గోరఖ్‌పూర్‌కు చెందిన మిశ్రా గారు, దర్భంగా ప్రాంతానికి చెందిన కన్హయ్యా గారితో నా సంభాషణ ఒక అన్వేషణకు దారితీసింది: ఇన్ని ప్రాంతాల ప్రజలు రామసీతలను తమ ఇంటి మనుషులుగా ఎలా చేసుకున్నారు?
“గోదావరి” పాటలో వేటూరి గారి సున్నితమైన ఊహ నుంచి ఉత్తరాంధ్ర మహిళల రామాయణ పాటలు, “సీత గడియ”లోని కుటుంబ బంధాలు, భద్రాచలం కల్యాణం, ఆగ్నేయాసియా రంగస్థలాల వరకు సాగే ఆ అన్వేషణే ఈ ఎపిసోడ్.
నా చిన్నతనంలో…
Website: podcasters.spotify.com

