Catatan episode
వంటింటి కథలు... గాధలు
కొన్ని జ్ఞాపకాలకు ఫోటోలు ఉంటాయి.
కొన్ని జ్ఞాపకాలకు మాత్రం వాసనలు ఉంటాయి.
ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తుంటే విశాఖలో చలి గాలి. అలా వెళ్తూ గానుగ దగ్గర ఆగాను. నువ్వుల నూనె వాసన మధ్య అనుకోకుండా కంటపడింది — తెలగపిండి.
అంతే.
మనసు ఒక్కసారిగా చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది.
వేడి వేడి అన్నం.
తెలగపిండి.
కాస్త నువ్వుల నూనె.
పక్కన పచ్చి ఉల్లిపాయ.
ఇంటికి తీసుకెళ్లిన తెలగపిండిని చూసిన వెంటనే ఉదయ అమ్మగారికి ఏం చేయాలో తెలుసు.
Recipe book లేదు.
YouTube లేదు.
Measurements లేవు.
చేతికి తెలుసు. జ్ఞాపకానికి తెలుసు.
అక్కడే నాకు ఒక ఆలోచన వచ్చింది.
మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు తెలిసిన ఈ…
Situs: podcasters.spotify.com

